తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2019, 1:31 PM IST

ETV Bharat / state

'విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలి'

విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్​ ఉంటుందని ఎన్సీసీ గ్రూప్​ కమాండింగ్​ అధికారి కల్ణల్​ కృష్ణ కుమార్​ అన్నారు.

'విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలి'

'విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలి'

యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలనే భావనతో NCC ద్వారా బాల బాలికలకు శిక్షణ అందిస్తోందని గ్రూప్​ కమాండింగ్​ అధికారి కల్ణల్​ కృష్ణ కుమార్​ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిబిరాన్ని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కాడెట్లతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి శిబిరం కొత్త వ్యక్తులను పరిచయం చేయడంతో పాటు అనేక పాఠాలను నేర్పుతుందన్నారు. ఉత్తమ కాడెట్​గా రాణించాలంటే క్రమశిక్షణ అవసరమని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details