కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎన్సీసీ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సెప్టెంబర్ 4 వరకు జరిగే ఈ శిబిరానికి తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని... అప్పుడే గుర్తింపు వస్తుందని ఎన్సీసీ అధికారి అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఎంపికలో ఈ అభ్యర్థులు పాల్గొంటారని అజయ్ తెలిపారు.
'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి' - 'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి'
ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని తొమ్మిదో తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ అధికారి అజయ్ కుమార్ వెల్లడించారు.
'ఉన్నత స్థానంలో నిలవాలంటే ప్రతిభను ప్రదర్శించాలి'