తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్​,​ సీపీ - సీపీ కమలాసన్ రెడ్ది కలెక్టర్ కె.శశాంక రక్తదానం

మనం దానం చేసే ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణం పోసే అమృత బిందువు కావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. జిల్లా ప్రధాన వైద్యశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో ఆయన పాల్గొని రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్​,​ నగర సీపీ

By

Published : Apr 10, 2020, 8:18 PM IST

మనం చేసే రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడటం కంటే మరో పరోపకారం ఏదీ ఉండదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. జిల్లా ప్రధాన వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సీపీ కమలాసన్ రెడ్ది, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్​ లాల్​తో కలిసి కలెక్టర్ కె.శశాంక పాల్గొని రక్తదానం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో కరోనా వైరస్ వల్ల బ్లడ్​ బ్యాంకులో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క పురుషుడు 3 నెలలకు ఒకసారి, మహిళలు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని ఆయన తెలిపారు. రక్తదానం కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.

ఇదీ చూడండి:మూడు కిలోమీటర్లు దాటితే పట్టేస్తోంది.. జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details