పటిష్ట ప్రణాళికతో అహర్నిశలు కృషి చేస్తే ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా అఖండ విజయం సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మరోసారి ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ర్యాంకులతో సంచలనం సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు. అజ్మీరా సాయి విశ్వంత్ లాల్ జాతీయస్థాయిలో 540 ర్యాంకు సాధించగా..మరో నలుగురు రెండు వేల లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 342 మంది ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నరేందర్ రెడ్డి అభినందించారు.
'పటిష్ట ప్రణాళికతో విజయం మీదే' - karimnagar
ఐఐటీ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. కచ్చితమైన ప్రణాళిక, పట్టుదల, కృషి ఉంటే ఏ పరీక్షల్లోనైనా అఖండ విజయం సాధించవచ్చని తెలిపారు.
'పటిష్ట ప్రణాళికతో విజయం మీదే'