కొవిడ్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన కళాకారులకు కరీంనగర్లోని నాన్న ఫౌండేషన్ చేయూతనిచ్చింది. ఏడాదిగా ఎలాంటి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకుంది. ఇలాంటి విపత్కర సమయంలో నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ గోగుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.
Nanna Foundation: కష్టకాలంలో కళాకారులకు అండగా నాన్న ఫౌండేషన్ - కరీంనగర్ వార్తలు
కొవిడ్ మహమ్మారి దెబ్బకు చాలా రంగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా సినీరంగంలోని కళాకారుల జీవితాలు ఆగమాగం అయ్యాయి. అలాంటి వారికి నాన్న ఫౌండేషన్ చేయూతనిచ్చింది. దాతల సహకారంతో కరీంనగర్లో 107 మందికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కరీంనగర్లోని కళాకారులకు నాన్న ఫౌండేషన్ చేయూత
కష్టాల్లో ఉన్న కళాకారులను ఆదుకోవడానికి దాతల సహకారంతో నాన్న ఫౌండేషన్ ముందుకు వచ్చింది. నగరంలోని 107 మంది కళాకారులకు సాయమందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ అధైర్య పడవద్దని.. మళ్లీ మంచి రోజులు వస్తాయని ఛైర్మన్ గోగుల ప్రసాద్ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కూడా పాల్గొన్నారు