కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాగుల పంచమి సందర్భంగా వేకువజాము నుంచే మహిళలు ఆలయాలకు చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరోనా భయం ఉన్నప్పటికీ నాగేంద్రుఆడే తమకు రక్షని భావిస్తూ... ఆలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తున్న మహిళలు - full of dedvotees at karimnagarr temples
నాగుల పంచమి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆలయాన్ని భక్తులతో నిండిపోయాయి. కరోనా కారణంగా మహిళలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. పుట్టలో పాలు పోస్తున్నారు.
భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తున్న మహిళలు
వివాహం కాని వారు, పిల్లలు పుట్టని వారు నాగదేవతను పూజిస్తే... అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉన్నందున చాలా మంది నాగేంద్రుడికి ఈ రోజు పూజలు చేస్తారు. పుట్టల దగ్గరకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పాముకు పాలు పోస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..