కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీ రోడ్డులో మతీన్ స్నేహితుల బృందం నివాసముంటుంది. ఈ సభ్యుల్లోని అనూప్‌సింగ్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్నేహితులందరూ అతనికి ధైర్యం నూరిపోశారు. ఏమి కాదు నీకు అంటూ భరోసానిచ్చారు. కానీ అనూప్‌సింగ్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
సిక్కు స్నేహితునికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు - కరోనా మృతులు
వారి స్నేహాన్ని కరోనా ఆపలేకపోయింది. కొవిడ్‌తో చనిపోయిన వారికి.. సొంత వారే అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న ఈ తరుణంలో మానవత్వాన్ని, స్నేహభావాన్ని చాటారు కొందరు యువకులు. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరణించిన మిత్రుడికి సంప్రదాయ పద్ధతిలో ఆఖరి వీడ్కోలు తెలిపారు.
సిక్కు స్నేహితునికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు
స్నేహితడు మృతి చెందినా.. వారంతా అతనిని విడిచిపోలేదు. తమ మతం కాదని ఆలోచించలేదు. ఆస్పత్రి నుంచి మొదలుకుని.. సిక్కు పద్ధతి అనుసరించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహానికి కులమతాలే కాదు.. ఏ వైరస్ కూడా అడ్డురాదని నిరూపించి ఆదర్శంగా నిలిచారు ఈ బృందం.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఎఫెక్ట్: తిండి కోసం తిప్పలు.. చెట్ల కిందే పడిగాపులు