కొవిడ్ బారిన పడిన ఓ వృద్ధుడు… ఎవరూ ఆదరించలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు చొరవచూపి మృతునికి అంత్యక్రియలు నిర్వహించాడు.
కొవిడ్‌తో వృద్ధుడి ఆత్మహత్య .. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం యువకుడు - తెలంగాణ తాజా వార్తలు
కొవిడ్ మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. మనుషులపై శారీరకంగాను, మానిసికంగాను దాడి చేస్తోంది. కొవిడ్ సోకిందని.. మనస్తాపంతో మృతిచెందిన ఓ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ ముస్లిం యువకుడు.
![కొవిడ్‌తో వృద్ధుడి ఆత్మహత్య .. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం యువకుడు తెలంగాణ వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:21:15:1621561875-tg-krn-03-20-karonathomrutiantyakriyalu-av-3038228-20052021235602-2005f-1621535162-605.jpeg)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్‌కు చెందిన పోతారవేణి వెంగయ్య (69)కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. మనస్థాపంతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్ పాషా అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పంచాయతీ ట్రాక్టర్లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్ భయంతో ఎవరు ముందుకు రాకున్నా... కుల మతాలకతీతంగా యువకుడు అంత్యక్రియలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు.
ఇదీ చూడండి:'రాష్ట్రంలో అందరికి ఉచిత కరోనా చికిత్స అందించాలి'