తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad by elections 2021: అభ్యర్థులకు సవాలుగా మున్సిపాలిటీలు.. పట్టుకోసం స్పెషల్ ఫోకస్! - హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం వార్తలు

పెద్ద పంచాయతీలు హుజూరాబాద్‌(Huzurabad by elections 2021) నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థుల భవితను మార్చేందుకు ఇక్కడి ఊళ్లల్లోని రాజకీయమే ప్రస్తుతం కీలకంగా మారుతోంది. పెద్ద ఊళ్లల్లో పట్టును సంపాదిస్తే సులువుగా ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని పొందొచ్చనే వ్యూహాలను ప్రధాన పార్టీలు(huzurabad election campaign) అనుసరిస్తున్నాయి. ప్రచార గడువు తరువాత రాత్రి వేళల్లో అక్కడి నేతలతో మంతనాల్ని సాగిస్తున్నారు.

Huzurabad by elections 2021, huzurabad election campaign news
హుజూరాబాద్ ఉపఎన్నికలు 2021, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం

By

Published : Oct 22, 2021, 12:20 PM IST

హుజూరాబాద్ ఎన్నికల(Huzurabad by elections 2021) నేపథ్యంలో ఎక్కువ ఓట్లు ఉండే మేజర్‌ పంచాయతీల్లోని ఓట్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఓటర్లు గణనీయంగా ఉండటంతో ఆ అవకాశాన్ని వరంగా మార్చుకోబోతున్నాయి. పెద్ద ఊళ్లల్లో పట్టును సంపాదిస్తే సులువుగా ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని పొందొచ్చనే వ్యూహాలను(huzurabad by election campaign) మూడు పార్టీలు అనుసరిస్తున్నాయి. ఓవైపు పల్లెల్లో ప్రచారాల్ని నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రచార గడువు తరువాత రాత్రి వేళల్లో అక్కడి నేతలతో మంతనాల్ని సాగిస్తున్నారు. రోజూవారీగా ఓటు బలం ఎటువైపు మారుతుందనే అంచనాలను అడిగి తెలుసుకుంటున్నారు.

25 శాతం ఊళ్లల్లో..

2500 ఓటర్ల నుంచి దాదాపుగా 7వేలకుపైగా ఓటర్లున్న పెద్ద పంచాయతీలు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో(Huzurabad by elections 2021) ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇక్కడి బరిలో నిలిచే అభ్యర్థుల భవితను మార్చేందుకు ఇక్కడి ఊళ్లల్లోని రాజకీయమే ప్రస్తుతం కీలకంగా మారుతోంది. ఐదు మండలాల పరిధిలో మొత్తంగా 106 గ్రామపంచాయతీలున్నాయి. ఇందులో దాదాపుగా 25శాతం అనేలా 26 పెద్ద పంచాయతీలున్నాయి. అన్ని పార్టీలకు పట్టున్న గ్రామాలుగా పేరొందిన ఇక్కడ ప్రజల మన్ననల్ని ఈ ఐదారు రోజులు పొందగలిగితే విజేతలుగా నిలువగలమనే విశ్వాసంతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నేతలున్నారు. ఇల్లందకుంట, మల్యాల, సిరిసేడు, రాచపల్లి, బూజునూర్‌, మడిపల్లి, కోరపల్లి, తనుగుల, వావిలాల, మాచనపల్లి, వీణవంక, చల్లూరు, మామిడాలపల్లి, వల్బాపూర్‌, నర్సింగాపూర్‌, భేతిగల్‌, గన్ముకుల, కమలాపూర్‌, ఉప్పల్‌, శనిగరం, మర్రిపల్లి గూడెం, అంబాల, చెల్పూర్‌లతోపాటు మూడు పెద్ద ఊళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఆయా పార్టీల ముఖ్యనేతలకు అనువుగా ఉన్న ఈ గ్రామాల్లో నాయకులపై అభ్యర్థులు విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఓటర్లు కూడా తమను గుర్తించి ఓటు వేస్తారనే ధీమాతో ఈ ఊళ్లపైనే ప్రచారం పరంగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

పుర ఓటర్లు ఎటువైపో..?

ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పురపాలికలున్నాయి. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో ఉన్న 60 వార్డులో సుమారు 57వేలకుపైగా ఓటర్లున్నారు. జమ్మికుంటలో 30వేల పైచిలుకు.. హుజూరాబాద్‌లో(Huzurabad by elections 2021) 27 వేలకుపైగా ఉన్న ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే విషయంలో మూడు పార్టీలు వ్యూహాల్ని అవలంబిస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా అన్ని పార్టీలు ఏదో ఒక కాలనీల్లో ప్రచారం సాగించేలా పలు బృందాలను తయారు చేసుకున్నాయి. ఇక ఇక్కడి ప్రచారానికి వస్తున్న తమ పార్టీ ముఖ్యులను ఈ వార్డుల్లో తిప్పుతూ పార్టీకి ఓట్లేయ్యమనే ప్రచారాల్ని విరివిగా కొనసాగిస్తున్నారు. ఇక పట్టణ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనే భయం మాత్రం మూడు పార్టీలకు ముచ్చెమటల్ని పెట్టిస్తోంది. తమ గెలుపునకు ఇక్కడి ఓట్లను ఆయుధంగా మలుచుకోవాలనేలా ఎత్తుగడల జోష్‌ను పెంచుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details