కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌లో 30వార్డులకు గాను 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 17 ప్రాంతాల్లో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 7 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 230 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
జమ్మికుంటలో
జమ్మికుంటలో 30 వార్డులకు 12 ప్రాంతాల్లో 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు 300 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో బెన్ షలోమ్‌లు సందర్శించారు. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జేసీ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి