కరీంనగర్లో ఎమ్మార్పీఎస్ 26 వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్ఖానగడ్డ, రాజీవ్నగర్లలో పారిశుద్ధ్య కార్మికులతో జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను సన్మానించారు. 26 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమాలతో ఎన్నో ఫలితాలు సాధించామని కో కన్వీనర్ నీర్ల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్లో ఘనంగా ఎమ్మార్పీఎస్ 26వ వార్షికోత్సవం - mrps 26th anniversary celebrations
కరీంనగర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ 26 వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు కాలనీల్లో పారిశుద్ధ్య కార్మికులతో జెండా ఆవిష్కరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
mrps 26th anniversary celebrations in karimanagar
ప్రస్తుత కరోనా ఆపద సమయంలో పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులను 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని... వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జింక మల్లేశం, బండారి వేణు, కుమ్మరి శంకరయ్య, నక్క సుధాకర్ పాల్గొన్నారు.