కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి కరోనా పరీక్షల కోసం ఓ వ్యక్తి వెళ్లారు. వైద్యులు లేకపోవడం వల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ కోసం స్థానిక తహశీల్దార్ ఆసుపత్రికి వెళ్లగా ఆ ప్రభుత్వ వైద్యుడు దురుసుగా ప్రవర్తించాడని.. అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్వో స్పష్టం చేశారు. జమ్మకుంటకు చెందిన సంతోష్ అనే వ్యక్తి కరోనా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. గత కొన్నిరోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా.. వైద్యుడు అందుబాటులో లేరంటూ పాలనాధికారి శశాంకకు ఫిర్యాదు చేశారు.
విచారణకు వెళ్లిన ఎమ్మార్వోపై ప్రభుత్వ వైద్యుడి దురుసు ప్రవర్తన - mro to complaint to colector on government doctor
కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు లేరంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు వచ్చింది. విచారణకు వెళ్లిన తహశీల్దార్‌పై ప్రభుత్వ వైద్యుడు దురుసుగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. ఈ విషయమై కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మార్వో నారాయణ వెల్లడించారు.
విచారణకు వెళ్లిన ఎమ్మార్వోపై ప్రభుత్వ వైద్యుడి దురుసు ప్రవర్తన
ఈ విషయమై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. తహశీల్దార్ నారాయణ ఆసుపత్రికి చేరుకుని సంతోష్‌తో మాట్లాడారు. విచారణ క్రమంలో అప్పుడే వచ్చిన వైద్యుడు.. తహశీల్దార్‌పై దురుసుగా ప్రవర్తించాడు. నువ్వేమైనా నా పై అధికారివా?.. నీ విభాగానికి మాత్రమే నువ్వు బాస్‌వి.. మాకు కాదు అంటూ వైద్యుడు మండిపడ్డారు. విచారణకు వచ్చిన అధికారిపై ఇలా మాట్లాడటం సరికాదని తహశీల్దార్ పేర్కొన్నారు. వైద్యుడి ప్రవర్తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.