తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటో పెట్టాల్సిందే: బండి సంజయ్​ - కరీంనగర్ వార్తలు

కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటోను ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కుమార్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని ఫొటో పెట్టకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. ఫొటోలు పెట్టే అంశంలో అధికారుల పాత్ర ఏమిలేదని స్పష్టం చేశారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Dec 22, 2020, 7:34 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార విషయంలో కరీంనగర్ దిశ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్... కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటోను ఏర్పాటు చేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకం ప్రజల్లోకి వెళ్లాలంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫొటోలు ఉండాల్సిందేనన్నారు.

కేంద్ర పథకాలకు ప్రధాని ఫొటో పెట్టకపోవడానికి కారణం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఫొటో పెట్టొద్దని ఎవరైనా చెప్పారా అని నిలదీశారు. ఫొటోలు పెట్టే అంశంలో అధికారుల పాత్ర ఏమిలేదని.. ఆ సమావేశానికి హాజరైన తెరాస ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఎవరి ఫొటోలు పెట్టాలనే అంశంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు.

కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటో పెట్టాల్సిందే: బండి సంజయ్​

ఇదీ చదవండి :'పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు'

ABOUT THE AUTHOR

...view details