కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రతినిదులను తెరాస వేటాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్ విమర్శించారు. తెరాస అంటే ఉద్యమ పార్టీ అని ప్రస్తుతం చేసేది కూడా రాష్ట్ర అభివృద్ధి ఉద్యమమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఐదుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినోద్ కుమార్.
'తెరాసని అణగదొక్కే ప్రయత్నం చేసినా.. భయపడలేదు'
ఎవరినీ బలవంతంగా పార్టీలోకి లాక్కోవట్లేదని... రాష్ట్ర అభివృద్ధి, తెరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.
'తెరాసని అణగదొక్కే ప్రయత్నం చేసినా.. భయపడలేదు'