ఆర్టీసీ ర్యాలీలో ఎంపీ బండి, కోదండరాం - కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భాజపా ఎంపీ బండి సంజయ్, తెజస అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
![ఆర్టీసీ ర్యాలీలో ఎంపీ బండి, కోదండరాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4757620-625-4757620-1571131973483.jpg)
ఆర్టీసీ ర్యాలీలో ఎంపీ బండి, కోదండరాం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండు ఎదుట ఆర్టీసీ కార్మికులతో పాటు సీపీఐ, సీపీఎం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ర్యాలీ చేపట్టారు. తెజస అధ్యక్షుడు కోదండరాం కరీంనగర్లోని బస్టాండు వద్దకొచ్చి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు.
ఆర్టీసీ ర్యాలీలో ఎంపీ బండి, కోదండరాం
Last Updated : Oct 15, 2019, 5:09 PM IST