తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్‌ - కరీంనగర్ జిల్లా

రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి రోజు నుంచి భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి.. తలసేమియా, ఇతర వ్యాధిగ్రస్థులకు రక్త నిల్వలు కోరత లేకుండా చూస్తున్నామని ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సంజయ్‌ ప్రారంభించారు.

blood donation camp
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్‌

By

Published : Apr 16, 2020, 3:17 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వైద్య, పోలీస్, పారామెడికల్, ఇతర సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వలస కూలీలకు రేషన్ సరుకుల పంపిణీ సరిగా జరగలేదని మండిపడ్డారు.

ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇస్తున్న సూచనలను విమర్శనాత్మకంగా తీసుకోకుండా వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి రోజు రక్తదాన శిబిరాలను భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి తలసేమియా మరియు ఇతర వ్యాధిగ్రస్థులకు రక్త నిల్వలు కోరత లేకుండా చూస్తున్నామన్నారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్‌

ఇదీ చూడండి:చిన్న అక్షర దోషం- కుటుంబం మొత్తానికి కరోనా కష్టం

ABOUT THE AUTHOR

...view details