దిశ ఘటన దేశవ్యాప్తంగా చెడు వాతావరణాన్ని సృష్టించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్సభలో దిశ ఘటనపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఘటన జరిగినప్పుడే స్పందించడం కాకుండా.. ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప బాధితులకు న్యాయం జరగదన్నారు. ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని బండి సంజయ్ అన్నారు.
'దిశ' లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: బండి సంజయ్ - దిశ ఘటనపై పార్లమెంట్లో చర్చ
దిశ లాంటి ఘటనలు జరగకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని అన్నారు.
'దిశ' లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: బండి సంజయ్
TAGGED:
దిశ ఘటనపై పార్లమెంట్లో చర్చ