కరోనాతో ఏదో జరిగి పోతుందనే భయం ప్రజలకు అవసరం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కొవిడ్ నివారణకు కావాల్సిన నిధులు, సామగ్రిని కేంద్రం రాష్ట్రానికి సరఫరా చేసిందని గుర్తు చేశారు.
కరోనాతో ఏదో జరిగి పోతుందనే భయం వద్దు : ఎంపీ బండి సంజయ్ - కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి బండి సంజయ్ 500 కిట్లు పంపిణీ
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డును కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. 500 పీపీఈ కిట్లను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇంటి యజమానులు ఇబ్బందుల పెడుతున్నట్లు సమాచారం వస్తోందని. ఆ పద్ధతి మంచిది కాదని ఎంపీ సూచించారు.
కరోనాతో ఏదో జరిగి పోతుందనే భయం వద్దు : ఎంపీ బండి సంజయ్
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ వార్డును పరిశీలించిన బండి సంజయ్ వైద్యులకు 500 పీపీఈ కిట్లను అందజేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో కరోనా సేవలందిస్తే ప్రభుత్వాసుపత్రులపై భారం తగ్గుతుందని సూచించారు. పరీక్షలు ఇంకా పెంచితేనే పాజిటివ్ కేసులు బయటపడతాయన్నారు.
ఇదీ చూడండి :కరోనా బాధితులకు 'అమ్మ'లా చికిత్స చేస్తున్నారు: హరీశ్