తెలంగాణ

telangana

ETV Bharat / state

బంజారాలపై కేసీఆర్ వివక్ష: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ - ఎంపీ బండి సంజయ్ కుమార్ వార్తలు

రాష్ట్ర ఏర్పాటు కోసం బంజారాలు తమ వంతు పోరాటం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అలాంటి బంజారాలను సీఎం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.

mp-bandi-sanjay-on-banjaras
బంజారాలను సీఎం పట్టించుకోవట్లేదు: బండి సంజయ్

By

Published : Jul 1, 2020, 2:20 PM IST

తెలంగాణ సాయుధ భూ పోరాట యోధుడు ఠాను నాయక్ 108వ జయంతిని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్‌ హాజరయ్యారు. బంజారాలు హిందూ సమాజం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఠానూనాయక్‌... నిజాం నిరంకుశ పాలనలో వీరోచితంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన పేదల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం అవసరమన్నారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం బంజారాలు తమవంతు పోరాటం చేశారని... అలాంటి వారిని కేసీఆర్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా గిరిజనులను వంచిస్తే... భాజపా వారికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యాక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details