తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తా' - latest news on mp bandi sanjay kumar

కరీంనగర్​ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఎంపీ బండి సంజయ్​కుమార్​ పరామర్శించారు. ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

mp bandi sanjay kumar
'నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తా'

By

Published : Mar 10, 2020, 2:02 PM IST

కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎంపీ బండి సంజయ్​ కుమార్ పరిశీలించారు. గంగాధర మండలంలోని పలు గ్రామాలను సందర్శించి.. అక్కడి రైతులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

గత సంవత్సరం యాసంగిలో ఇదే విధంగా పంట నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం అందలేదని ఎంపీ గుర్తు చేశారు. ఈసారి రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

'నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తా'

ఇవీ చూడండి:తెలంగాణ నేలపై డైనోసార్​లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details