ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 18, 20వ వార్డుల్లో పర్యటించి.. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.
హుజూరాబాద్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి - mp bandi sanjay kumar attended palle pragathi program
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్‌కుమార్ పాల్గొని పలు కాలనీల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హుజూరాబాద్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి
మురుగు కాలువలను పరిశీలించి అధికారులు, కౌన్సిలర్లకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారులకు మెరుగైన విద్య అందించాలని టీచర్లకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐదు, పది రోజులకు పరిమితం చేయకుండా ప్రతి రోజు చేపట్టాలని ఎంపీ చెప్పారు.
హుజూరాబాద్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి
TAGGED:
PATTANA PRAGATHI MP ATTEND