హుజూరాబాద్ నుంచి పున్నం రమేష్, రమ, సంకీర్తన్ బైక్ మీద కరీంనగర్‌కు బయలుదేరారు. ఇటీవలే కురిసిన వర్షాలకు మానకొండూర్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు మరమ్మతుకు గురైంది. గుంతల కారణంగా బైక్ అదుపుతప్పడంతో ముగ్గురు కిందపడి గాయపడ్డారు.
మరోసారి దాతృత్వం చాటుకున్న బండి సంజయ్ - ఎంపీ బండి సంజయ్ వార్తలు
రోడ్లపై ఏర్పడిన గుంతలో పడి ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆపన్న హస్తం అందించారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
మరోసారి దాతృత్వం చాటుకున్న బండి సంజయ్
అదే సమయంలో కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... వరంగల్ పర్యటనకు బయలుదేరారు. ఈ ప్రమాదాన్ని చూసి కారు ఆపి వారితో మాట్లాడారు. వివరాలు తెలుసుకుని... ధైర్యం చెప్పి... సొంత వాహనంలోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
ఇదీ చూడండి:గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా