కరీంనగర్లో నిర్వహించిన వేసవి ముగింపు శిక్షణలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఎంపీ బండి సంజయ్ కుమార్ విద్యార్థుల నృత్యాలను తిలకించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే వారికి ఇష్టమున్న కళలను నేర్పిస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు సూచించారు. కులమతాలకు అతీతంగా కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన కళాభారతి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ సంజయ్ హామీ ఇచ్చారు.
'కళామతల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా' - BANDI SANJYA
విద్యార్థులకు ఇష్టమున్న కళను నేర్పిస్తూ... వారి ఎదుగుదలకు కృషి చేయాలని భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.
'కళామతల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా'