ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్‌ను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నించినప్పటికీ... అడ్డుకోలేక పోయారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రెండు రోజుల నుంచే హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసినప్పటికీ మిలియన్ మార్చ్ విజయవంతమైందని తెలిపారు. ప్రభుత్వ నిర్బంధాలను, పోలీసు వలయాలను చేధించుకుని వేలాది మంది ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారన్నారు. ఉద్యమ సత్తా చాటిన అందరికీ హ్యాట్సాఫ్ అని ఎంపీ అభినందించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్మికులు, వివిధ పార్టీల కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తకుండా... మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సంజయ్ హెచ్చరించారు.
మిలియన్ మార్చ్ విజయవంతం: బండి సంజయ్ - TSRTC Strike today news
ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ విజయవంతమైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారని తెలిపారు.
MP bandi sanajy said today RTC million march success