ఉద్యమం చేయకుండానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందా అంటూ భాజపా ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తే ఉద్యమం.. కార్మికులు చేస్తే ఆందోళనలా అంటూ మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన తనపై చేయి చేసుకోవడం ఎంత వరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన పోలీసులపై హెచ్ఆర్సీతో పాటు పార్లమెంట్ వ్యవహారాల మంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. కరీంనగర్లో పోలీసులు సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని బండి సంజయ్ అన్నారు.
'ఆయన చేస్తే ఉద్యమం.. కార్మికులు చేస్తే ఆందోళనలా?' - కేసీఆర్పై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్
ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకుంటున్నారని... మానవత్వం లేకుండా మాట్లాడి ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం కల్పిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బండి సంజయ్