పెట్రోల్, డీజిల్‌లపై పన్నుల రూపేణా రూ.31లు వసూలు చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) దానిని తగ్గించి కేంద్రానికి లేఖ రాస్తే.. ఆ లేఖపై తానూ సంతకం చేస్తానని నిజామాబాద్ ఎంపీ (nizamabad mp) ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (huzurabad) నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్‌లోని ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని ఎక్కడా డ్రాఫ్ట్ బిల్లులో చెప్పలేదని అర్వింద్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు (minister harish rao) అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రాఫ్ట్ బిల్లుపై హుజూరాబాద్ బస్టాండ్ వద్ద చర్చకు సిద్ధమా అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారటం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని అర్వింద్ ఆరోపించారు. జాతీయ హోదా కల్పిస్తే ఎక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనని భయం పట్టుకుందని విమర్శించారు.
నిర్మల్ జిల్లా బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇవ్వటం అంటే టెర్రరిస్టులకు సహకరించటమేనని అర్వింద్ అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్‌పోర్టుల జారీకి సహకరించిన పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దళిత బంధుకు రూ.1.70 లక్షల కోట్లు పెద్ద విషయం కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, ఆవాస్ యోజన పథకాలకు ఎందుకు ఇన్స్టాల్మెంట్స్ కట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదని.. 2023లో తెరాసను ఓడించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
MP ARVIND: 'కేసీఆర్ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదు' 'దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతుల వారందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలి. ఈటల రాజేందర్ వల్లే ఈ దళితబంధు పథకం వచ్చింది. ఈ పథకానికి ఆయన ఒక్కడికే క్రెడిట్ దక్కుతుంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చారు. ఈ విషయాన్ని హుజూరాబాద్ ప్రజలు గమనించాలి.' -ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇదీ చూడండి: Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్‌పేటకు బిడ్డనే: కిషన్ రెడ్డి