Mother Died Of Heart Attack Because Son Was Suicide : విధిరాత ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టం.. దాని ఫలితంగా మృత్యువు ఏ మార్గంలో ముంచుకొస్తుందో తెలియదు. ఆ విధి ఆడిన నాటకంలో ఏకంగా ఓ కుటుంబమే మట్టిలో కలిసిపోయింది. వివాహం జరిగి ఏడాదైనా కాలేదు.. అప్పుడే భార్య ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటిలో ఇల్లాలు లేని లోటుతో దిగులు చెంది.. భర్త కూడా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సైతం గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ దృశ్యాలను చూసి.. గ్రామస్థులు కన్నీరు పెట్టుకుని.. ఇదే కదా విధి అని కన్నీరుపెట్టుకున్నారు. ఈ యథార్థ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని నేదునూరు గ్రామానికి చెందిన బోల్లంపల్లి శ్యాంసుందర్‌కు.. హుస్నాబాద్‌కు చెందిన శారద అనే మగువతో ఏడాది క్రితం వివాహం అయింది. భర్త మంచి గాయకుడు.. ఆయన రాష్ట్రస్థాయిలో కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి సంసార జీవితంలో.. వచ్చిన చిన్న కుదుపు వారి జీవితాలనే మార్చేసి విషాదాన్ని మిగిల్చింది.