కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రహదారి సత్యసాయి కల్యాణ మండపం వద్ద వానరాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన బొమ్మకల్ గ్రామస్థులు జంతు సంక్షేమ కమిటీ సభ్యులు కలిసి గ్రామంలోని రామాలయం వద్ద అంత్యక్రియలు చేశారు. జంతువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని జంతు సంక్షేమ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సుమన్ సూచించారు.
వానరానికి అంత్యక్రియలు చేసిన బొమ్మకల్ గ్రామస్థులు - వానరం
మనుషులు చనిపోతుంటేనే పట్టించుకోని నేటి కాలంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు కరీంనగర్ జిల్లాలోని ఆ గ్రామ ప్రజలు.
వానరానికి అంత్యక్రియలు చేసిన బొమ్మకల్ గ్రామస్థులు