కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తన డివిజన్ పరిధిలోని 700 మంది పేదలకు నిత్యావసరాలను, రూ. 500 నగదును పంచి పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ వీటిని అందజేశారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, నగదుతో పాటు తాను ఇచ్చే వస్తువులు వారు పస్తులు ఉండకుండా కాపాడతాయని మేయర్ చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించవద్దని సూచించారు. పేదలకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సునీల్‌రావు కోరారు.
నగదు, నిత్యావసరాలు పంచిన కరీంనగర్ మేయర్ - Karimnagar Mayor Latest news
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు కరీంనగర్ మేయర్ అండగా నిలిచారు. దాదాపు 7 వందల మంది పేదలకు నిత్యావసర వస్తువులతోపాటు 500 రూపాయలను మేయర్ సునీల్‌రావు పంపిణీ చేశారు.
నగదు, నిత్యావసరాలు పంచిన కరీంనగర్ మేయర్
TAGGED:
Karimnagar Mayor Latest news