Modern Dobighat in karimnagar : స్మార్ట్ సిటీలో భాగంగా.. కరీంనగర్లో రజకుల సౌకర్యార్థం మోడ్రన్ దోబీఘాట్(Modern Dobighat) నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 142 అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో.. 142 మోడ్రన్ దోబీఘాట్లను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట తదితర పట్టణాల్లో ఏర్పాటు చేయగా.. ఇప్పుడు కరీంనగర్లో 3 మోడ్రన్ దోబీఘాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాషింగ్ యంత్రాలు ఉన్నాయి. ఒకేసారి 60 మంది రజకులు తమ పనులు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. రజక వృత్తి ఆధునిక సొబగులు దిద్దుకుంటే.. తమ కులవృత్తి పట్ల యువత ఆసక్తి చూపుతుందని మంత్రి గంగుల కమలార్ అన్నారు. తద్వారా ఉపాధి కోసం ఇతర దేశాలకు వలసలు వెళ్లే పరిస్థితికి అడ్డుకట్ట వేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
"తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బట్టలు ఉతికేందుకు నీళ్లు ఉండేవి కాదు. ఉన్న వాటితోనే బట్టలు ఉతికితే ఆ నీటిలో జలగలు, కలుషితమైన నీరు.. వీటి వల్ల వ్యాధులు వచ్చేవి. దీనివల్ల రజక వృత్తి చేసిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. సంపాదించింది అంతా ఆస్పత్రి ఖర్చులకే వెళ్లిపోయేది. రజక వృత్తి వారు గౌరవంగా బతకాలనే.. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒక రోజుకు 2500 బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసే సామర్థ్యం ఉన్న అధునాతన మిషనరీని ఏర్పాటు చేశాం. కరీంనగర్లో పెట్టే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది."- గంగుల కమలాకర్, మంత్రి
Gangula Talks With Ration Dealers : ఆ రెండు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: గంగుల