హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా తెరాస వైపే ఏకపక్షంగా ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(palla rajeshwar reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో ఇల్లందకుంట తెరాస నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీతోపాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్లు కనుమల్ల విజయ, సంపత్‌రెడ్డిలు పాల్గొన్నారు.
palla rajeshwar reddy: 'మనమంతా ఒక కుటుంబం' - ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ యంత్ర కళాశాలలో ఇల్లందకుంట తెరాస నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(palla rajeshwar reddy) తోపాటు... చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్లు కనుమల్ల విజయ, సంపత్‌రెడ్డిలు హాజరయ్యారు.
సుఢా ఛైర్మన్ జి.వి.రామక్రిష్ణారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో…సీఎం కేసీఆర్(CM KCR) 2003 నుంచి ఇప్పటి వరకు ఈటల రాజేందర్‌కు అన్ని పదవులు ఇచ్చారని ఎమ్మెల్సీ పల్లా గుర్తు చేశారు. మంత్రి హోదాలో ఉండి తప్పు చేశాడు కాబట్టే బర్తరఫ్ చేశారని, తానే తెరాస సభ్యత్వానికి రాజీనామా చేశాడని గుర్తు చేశారు. ఈ విషయమై పార్టీకి, ప్రభుత్వానికి నష్టమేమో అనే దాంట్లో చాలా మందికి అనుమానాలు ఉండేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిపై కక్ష్యసాధింపు చర్యలకు దిగరని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల చెందిన ఈటలకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన ఈటల భాజపాలో ఏలా చేరుతున్నావని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరటంతో ఇక్కడికి వచ్చామన్నారు. మనమంతా ఒక కుటుంబమన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, రాష్ట్ర నాయకులు పొనగంటి మల్లయ్య, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా, బ్లాక్‌ఫంగస్‌కు ఉచిత చికిత్స కోసం కాంగ్రెస్ దీక్ష