తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టించడం సరికాదు: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి - మహిళలతో కంటతడి పెట్టించడం సరికాదు

MLC on TRS and Janasena: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే మహిళల పట్ల వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ భోగా శ్రావణి రాజీనామా అంశంపై తీవ్రంగా స్పందించిన ఆయన కరీంనగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్​ను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టింటడం సరికాదన్న ఎమ్మెల్సీ వారిని అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మున్సిపల్‌లో అవిశ్వాస తీర్మాణం ఎన్నేళ్లకు పెట్టాలనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

jee
jee

By

Published : Jan 25, 2023, 8:13 PM IST

Updated : Jan 25, 2023, 8:19 PM IST

MLC Jeevan Reddy fires on TRS: జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగా శ్రావణి రాజీనామా అంశంపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి స్పందించారు. కరీంనగర్​లో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్​పర్సన్​తో పాటు కరీంనగర్ జడ్పీ ఛైర్​పర్సన్​లను బీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టించడం సరికాదని పేర్కొన్నారు. వారిని అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మున్సిపల్​లో అవిశ్వాసం మూడేళ్లకు పెట్టాలా.. నాలుగేళ్లకు పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ పార్టీకే భావ సారూప్యత లేదని, ఏ జెండా లేదని ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పొత్తుల గురించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. యాదాద్రి వద్ద పవర్ పాయింట్ నెలకొల్పి రాష్ట్రంలోనే ప్రజలపై 44 వేల కోట్ల భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టింటడం సరికాదు: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details