నిర్మాణాత్మకంగా వ్యవహారించాల్సిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్థాయిని మరిచి విమర్శలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన రాష్ట్రంలో ప్రణాళిక అమలు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. రైతుల రుణమాఫీకి కేటాయించిన 6 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ పై స్పష్టత లేదని వెల్లడించారు. కొత్తగా పంట రుణం కావాల్సిన రైతులకు ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించాలని కోరారు.
వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి - MLA JEEVAN REDDY LATEST NEWS
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర స్పందించారు. అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5146549-366-5146549-1574430777045.jpg)
వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి
వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి
ఇవీ చూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?
TAGGED:
MLA JEEVAN REDDY LATEST NEWS