వ్యవసాయ రంగంపై కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు రూ. 1,200 కోట్ల మేర నష్టపోతున్నారని ఆగ్రహించారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. కనీస మద్దతు ధర కల్పించిన తర్వాత వ్యవసాయ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత్రిత సాగుతో సన్నరకం ధాన్యం ఎకరాకు 25 క్వింటాలు మించి ఉత్పత్తి అయ్యే అవకాశం లేదన్నారు.
రూ. 2,500 మద్దతు ధర ఇవ్వాలని కోరినా... ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తోడు దొంగలుగా మారాయని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టంపై పార్లమెంట్లో తెరాస అటూ ఇటూ కాకుండా వ్యవహరించిందని విమర్శించారు.