కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షించారు.
అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే సంకె రవిశంకర్ సమీక్షించారు. ఇటీవల పాజిటివ్ కేసులు పెరిగినందున ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇటీవల పాజిటివ్ కేసులు పెరిగినందున ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా శ్రద్ధ చూపాలన్నారు. కరోనా బారిన పడి, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి వైద్యం అందేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా వైద్యం అందిస్తున్న వివరాలను సమీక్షించారు.
ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్