కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు 41 లక్షల 4 వేల రూపాయల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డ వివాహం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. చొప్పదండి మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఉద్రిక్తతంగా మారిన సీపీ కార్యాలయ ముట్టడి...