ధరణి పోర్టల్ భూముల క్రయవిక్రయాలు సరళతరం చేసే వినూత్నమైన మార్పు అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభివర్ణించారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఈ పోర్టల్ ప్రారంభించామని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు జరిగే తీరును పరిశీలించారు. భూ యాజమాన్య మార్పు కోసం దరఖాస్తులు, అధికారుల విచారణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీశారు.
'ధరణి వినూత్నమైన మార్పు... అవినీతికి ఆస్కారం లేదు' - karimnagar latest news
కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ పోర్టల్‌ను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఇప్పటినుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదని అన్నారు. ఈ వినూత్నమైన మార్పుతో అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.
'ధరణి వినూత్నమైన మార్పు... అవినీతికి ఆస్కారం లేదు'
ఈ పోర్టల్‌తో అధికారుల విలువైన సమయం ఆదా అవుతుందని ఆయన అన్నారు. ఇక నుంచి భూముల క్రమబద్ధీకరణకు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తొలగిపోతుందని స్పష్టం చేశారు. భూముల రిజిస్ట్రేషన్, పట్టాదారు పాసుపుస్తకం ఒకేరోజు జారీ చేయడంతో అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఎన్నిక ఏదైనా కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారు: కేటీఆర్