సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడిలా నిలుస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో అన్నదాతల సాగునీటి కష్టాలను తీర్చారంటూ కొనియాడారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె వాగులో రూ.6.7 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపడుతున్న మూడు చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
'సీఎం కేసీఆర్ సాగునీటి కష్టాలను తీర్చారు' - కరీంనగర్ జిల్లా రామడుగు మండలం
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ప్రభుత్వం చేపడుతున్న మూడు చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. డ్యామ్‌లు అందుబాటులోకి వచ్చిన అనంతరం.. వెయ్యి ఎకరాల భూములకు సాగునీరు అందనుందని తెలిపారు.
!['సీఎం కేసీఆర్ సాగునీటి కష్టాలను తీర్చారు' MLA Sunke Ravishankar inaugurated the construction work of three check dams in Karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9935998-1050-9935998-1608379088131.jpg)
'సీఎం కేసీఆర్ సాగునీటి కష్టాలను తీర్చారు'
చెక్‌డ్యామ్‌లు అందుబాటులోకి వచ్చిన అనంతరం.. రామడుగు మండలంలో వెయ్యి ఎకరాల భూములకు సాగునీటి సౌకర్యం కలగనుందని ఎమ్మెల్యే అన్నారు. భూగర్భ జలాలు పెరిగి సాగుకు అనుకూలంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సాగునీటి సౌకర్యం లేకే రైతులు ఆయా ప్రాంతాల నుంచి వలస వెళ్లేవారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:కొత్త రెవెన్యూ చట్టం అమల్లో జాప్యం.. ఇబ్బందుల్లో రైతులు