కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అకాల మరణం చెందిన 11 మంది రైతుల కుటుంబాలకు రూ. 55 లక్షల బీమా ప్రొసీడింగ్స్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. కుటుంబాన్ని పోషించే రైతు అకాల మరణంతో రైతు బీమా వారికి ఊరటనిస్తుందన్నారు.
రైతులకు బీమా చెక్కుల అందజేత: ఎమ్మెల్యే - MLA Sunke Ravishankar Latest News
కరీంనగర్లో అకాల మరణం చెందిన 11 మంది రైతు కుటుంబాలకు 55 లక్షల బీమా అందింది. బీమా ప్రొసీడింగ్స్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.
55 లక్షల బీమా ప్రొసీడింగ్స్లను అందజేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రతీ యేటా రూ.3 వేల కోట్లు ప్రీమియం చెల్లిస్తుందని వెల్లడించారు. రైతు అకాల మరణం చెందిన కుటుంబాలు అధైర్య పడకుండా ఉండాలని కోరారు. రైతుబీమా డబ్బుతో కుటుంబ అవసరాలకు ఖర్చు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు.