కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్ ద్వారా నీటిని విడుదల చేశారు. చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేష్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్లో జలహారతినిచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్ - mla sunke ravishankar gave jala harathi
ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్ ద్వారా కరీంనగర్ జిల్లా నారాయణపూర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు.
కరీంనగర్లో జలహారతినిచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్
ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు నారాయణపూర్ జలాశయానికి చేరాయి. వీటితో రెండు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందించనున్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేసి జలహారతినిచ్చారు.