కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల 26 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదన్నారు. అనంతరం బోయినపల్లి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ. 5లక్షల 33వేల చెక్కులను అందజేశారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం: ఎమ్మెల్యే సుంకె - ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ వార్తలు
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల 26వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు.
ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
రామడుగు, బోయినపల్లి మండల పరిషత్తు కార్యాలయాల్లో ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.