కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ లో 65 మంది లబ్ధిదారులకు రూ. 65 లక్షలు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుతో రాష్ట్రంలో బాల్యవివాహాలు నిలిచిపోయాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్... పేదింటి ఆడబిడ్డ పెళ్లి పరిస్థితిని స్వయంగా చూసి చలించి ఈ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
రామడుగులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - Karimnagar district news
కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ లో 65 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
రామడుగులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ