కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన క్యాంపు కార్యాలయంలో పరిశుభ్రత పనులు స్వయంగా చేపట్టారు. పూల మొక్కల్లో నిలువ నీటిని తొలగించారు. పాత డబ్బాలను తొలగించి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు తప్పనిసరి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపును అనుసరించి ప్రతి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
పరిశుభ్రతతో సకల రోగాలకు దూరంగా ఉండొచ్చు: ఎమ్మెల్యే రవిశంకర్
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా తన క్యాంపు కార్యాలయాన్ని శుభ్రం చేసుకున్నారు. పూల మొక్కల్లో నిలువ నీటిని తొలగించారు.
క్యాంపు కార్యాలయాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే