కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో 23 శాతం నుంచి 33 శాతానికి అడవులను పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. వెదురుగట్టలో స్థానికులు గత ఏడాది జూన్ నెలలో దాదాపు 185 ఎకరాల్లో 67 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారని తెలిపారు. పర్యావరణ సమతూకం అడవులు పెరిగితేనే సాధ్యమన్నారు. పట్టణంలోని ఓ ప్రాంతంలో ఎమ్మెల్యే మెుక్కలు నాటారు.
'పర్యావరణ సమతూకం అడవులు పెరిగితేనే సాధ్యం' - హరితహారం
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శాసనసభ్యులు సుంకె రవిశంకర్ హరితహారం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అడవులను పెంచేందుకు సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
'పర్యావరణ సమతూకం అడవులు పెరిగితేనే సాధ్యం'
ఆరో విడత హరితహారంలో మొక్కలను నాటడంతో పాటు కాపాడే బాధ్యత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని సూచించారు. కొడిమ్యాల మండలం హిమ్మత్ రావుపేటలో మాదిరిగా మంకీ ఫుడ్ కోర్ట్ కోసం పండ్ల మొక్కలను పెంచాలన్నారు. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఆర్డీవో పీడీ వేంకటేశ్వర రావు , మున్సిపల్ ఛైర్మన్ గుర్రం నీరజ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ఐదురోజుల పాటు మోస్తరు వర్షాలు