తెలంగాణ

telangana

ETV Bharat / state

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే - కరీంనగర్​ తాజా వార్తలు

కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్​లోని కందులను స్వయంగా తూకం వేశారు.

mla sunke ravisankar started Lentils purchase center
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Mar 1, 2020, 6:59 PM IST

గంగాధర మార్కెట్​ యార్డులో కందుల రైతుల కష్టాలు తీరనున్నాయి. కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా మార్కెట్ యార్డులో కందులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ యార్డుకు కందులు తీసుకొచ్చిన రైతులు తూకం సమయంలో క్రమ పద్ధతి పాటించాలని అధికారులు సూచించారు. వ్యవసాయాధికారుల నుంచి ధ్రువీకరణ పొందడం వల్ల కందులను సకాలంలో తూకం వేసేందుకు అవకాశం ఉందన్నారు.

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

ABOUT THE AUTHOR

...view details