గంగాధరలో ఆరు మండలాల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే కార్యచరణపై చర్చించారు. పరీక్షలు రాసే విధానంలో తప్పులను నిత్యం సమీక్షించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు హాజరయ్యారు.
ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్ష - mla sunke ravisankar review meeting on how to improve tenth class results
పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన కార్యచరణపై ఎమ్మెల్యే సుంకే రవిశంకర్... ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసే విధానం, ఉత్తీర్ణతా శాతం పెరుగుదల తదితర అంశాలపై చర్చించారు.
ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్ష