కరీంనగర్ జిల్లా గంగాధరలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 56 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవీందర్ అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ములుగు జిల్లా భాగ్యతండా ఉదంతంతో కేసీఆర్ చలించి... ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం చేశారని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడపిల్ల పెళ్లికి సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు.
సంక్షోభం ఉన్నా.. సంక్షేమం ఆపలేదు: ఎమ్మెల్యే - mla sunke ravindar
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 56 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవీందర్ అందజేశారు. సంక్షోభం ఉన్నా.. సంక్షేమ పథకాలను కేసీఆర్ ఆపలేదని వెల్లడించారు.
![సంక్షోభం ఉన్నా.. సంక్షేమం ఆపలేదు: ఎమ్మెల్యే checks distributed in Karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:22:26:1621590746-tg-krn-71-21-kalyanalaxmi-cheques-mla-avb-ts10128-21052021151821-2105f-1621590501-762.jpg)
checks distributed in Karimnagar
గతంలో ఆడబిడ్డ పెళ్లికి అప్పులు చేసేవారని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ పాత్ర పోషిస్తూ.. లక్ష రూపాయల సాయం చేస్తున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా.. పథకాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని వెల్లడించారు.