తెలంగాణ

telangana

ETV Bharat / state

'తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం' - mla visit program

యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు ఎమ్మెల్యే సుంకె రవిశంక్​ హామీ ఇచ్చారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలోని ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

mla sunke ravi shanker visited ikp center in desharajupally
'తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం'

By

Published : May 16, 2020, 7:30 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తి చేసిన ధాన్యాన్ని సత్వరం రైస్​ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసినా... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details