తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల పొట్టకొట్టేందుకే మొక్కజొన్న దిగుమతి'

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు అన్నీ... దశల వారీగా పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.

By

Published : Oct 27, 2020, 5:11 PM IST

mla sunke ravi shanker  participated in ramadugu meeting
mla sunke ravi shanker participated in ramadugu meeting

రైతుల పొట్టకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకుంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చే మొక్కజొన్న తక్కువ ధరకు ఉంటే మన రైతులు పండించిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకొని మొక్కజొన్న కొనుగోలుకు ఆదేశించారని తెలిపారు. దీన్ని కొందరు అర్థరహితంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే అభివృద్ధి పనులు అన్ని విధాల ముందుకు సాగుతున్నాయన్నారు.

గతంలో మండల సర్వసభ్య సమావేశంలో చర్చించిన అంశాలు పూర్తి కాకపోయేవని తెలిపారు. ప్రస్తుతం దశల వారీగా వాటిని పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.

ఇదీ చూడండి: వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details