కరోనా సోకిన వారు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ పాజిటివ్ వచ్చిన వారు తెలిసి జాగ్రత్తలు పాటించకుంటే సమాజానికి నష్టం కలుగుతుందన్నారు.
'కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే ఎక్కువ కేసులు నమోదు'
కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన వైరస్ సోకిన వారు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
'కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే ఎక్కువ కేసులు నమోదు'
గ్రామాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసులు అజాగ్రత్త వల్లేనని వ్యాపిస్తోన్నయని అభిప్రాయపడ్డారు. వైరస్ నిర్ధారణ అయిన వెంటనే తమ ఇంటిలో కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ, సరైన మందులు, వైద్య సహాయం పొంది మహమ్మారిని అధిగమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిందని స్పష్టం చేశారు.